| Daily భారత్
Logo




నా తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది: ఎమ్మెల్సీ కవిత

News

Posted on 2025-05-24 11:35:02

Share: Share


నా తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చింది: ఎమ్మెల్సీ కవిత

డైలీ భారత్, హైదరాబాద్:విదేశీ పర్యటన ముగిం చుకుని శుక్రవారం సాయంత్రం  హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం గా ఆమె సంచలన వ్యాఖ్య లు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వేడి పుట్టించారు. దేవుడు, దెయ్యాలు అంటూ పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేపారు కవిత. కేసీఆర్ దేవుడు అన్న కవిత.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ బాంబు పేల్చారు. కేసీఆర్ కు రాసిన లేఖపైనా కవిత స్పందించారు. 

రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాశా. నా అభిప్రా యాలు లేఖ ద్వారా తెలి పాను కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్న నే చెప్పా. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు, నాకు పర్సనల్ అజెండా లేదు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్ చుట్టూ ఉన్న వారి వల్లే నష్టం జరుగుతోంది.

అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది? అంతర్గత లేఖను ఎవరో బయటపెట్టారు. నేను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే పార్టీలో ఉన్న ఇతరుల పరిస్థితి ఏంటి? పార్టీలో ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాల్సిన అసవరం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. 

బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణను మోసం చేశాయి, నాశనం చేశాయి. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందని, కేసీఆర్ ఆగమవుతున్నారని కాంగ్రెస్ సంబరపడుతోంది.” అని కవిత అన్నారు. ఎమ్మెల్సీ కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికారు జాగృతి నేతలు, అభిమా నులు. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శిం చారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, కవి తకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాలేదు. ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కూడా కనిపించలేదు.

తన రాక సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాలని జాగృతి కార్యకర్తలకు సందేశం పంపారు కవిత. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ జనసమీకరణకు ప్లాన్ చేశారామె. మరోవైపు కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి. 

కవిత లేఖ డ్రామా అని బీజేపీ అంటుండగా.. బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >