| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రైవేట్ విద్య దోపిడిని అరికట్టాలి

ప్రైవేట్ విద్య దోపిడిని అరికట్టాలి

ప్రైవేట్ పాఠశాలలకు డిఇఓ అండదండలు..???

ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల్ అధ్యక్షుడు  ఎండి.సమీర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రైవేట్ విద్య దోపిడిని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల్ అధ్యక్షుడు  ఎండి.సమీర్ పేర్కొన్నారు. ఆదివారం చేవెళ్ల మున్సిపల్ పరిధిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

చేవెళ్లలో ప్రైవేట్ ఫీజుల దందా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. విద్యాశాఖ అధికారులు పూర్తిగా ప్రైవేటు విద్యా సంస్థలకు అమ్ముడుపోయారని, అందులో భాగంగానే వచ్చే విద్యాసంవత్సరా నికి ఈ విద్యా సంవత్సరం  ప్రారంభోత్సవం కాకముందే  అడ్మిషన్లు చేర్చుకుంటున్నారని తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. అలాంటి విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుర్తింపు లేని విద్యా సంస్థల, వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే అడ్మిషన్లు చేసుకుంటున్న విద్యాసంస్థల ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన నిర్వహిస్తుందని హెచ్చరించారు.

Previous లోయలో పడ్డ ఆర్మీ వాహనం... ముగ్గురు జవాన్లు మృతి
Next దమ్మపేట బిజెపి మండల అధ్యక్షులుగా పల్లపు వెంకటేశ్వరరావు
ADVERTISEMENT