| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

మున్నూరు కాపు  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మున్నూరు కాపు సంఘం నూతన అధ్యక్షుడు బోజ్జయ్య

పటాన్చెరు,  డైలీ భారత్ న్యూస్: పటాన్చెరు డివిజన్ పరిధిలోని మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన.. పటాన్చెరు పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణంలో మెజార్టీ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు సొంత నిధులను సైతం అందించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులను వారికి అండగా నిలుస్తామని తెలిపారు. కులం అంటేనే బలమని.. వారి వారి కులాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్ల పెళ్లిళ్లకు.. మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కులంలోనూ వర్గాలు సహజమని.. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, ఆదర్శ్ రెడ్డి, నర్రా బిక్షపతి, సంఘం నూతన అధ్యక్షులు బోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Previous వికలాంగులకు సామాజిక భద్రత కల్పించాలి
Next లోయలో పడ్డ ఆర్మీ వాహనం... ముగ్గురు జవాన్లు మృతి
ADVERTISEMENT