| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక

మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక

డైలీ భారత్, మహబూబాబాద్:  9.12 .2003 రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం మహాలక్ష్మి స్కీం మరియు ఆరోగ్య శ్రీ  పథకంలో భాగంగా మహిళలకు ఉచితముగా బస్సు సౌకర్యార్థం  బస్సును  గవర్నమెంట్ హాస్పిటల్ నందు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక  జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం  కలెక్టర్  మహాలక్ష్మి స్కీంలో భాగంలో  టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్,  Dm&Ho గవర్నమెంట్ హాస్పటల్ సూపర్డెంట్, డి ఆర్ డి ఓ, డిఎం, డిపో సూపర్డెంట్, మహిళా అధికారులు, మహిళ ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

బస్సులో మహబూబాబాద్ డిపో వరకు ప్రయాణం చేయడం జరిగింది.ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఎం శివ ప్రసాద్ మాట్లాడుతూ ఇది మహిళల కొరకు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మంచి పథకం మని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలందరూ ఆర్టీసీ బస్సులు ఆదరించాలని కోరడం జరిగింది.

Previous టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - నిబంధనలు ఇవీ
Next తెలంగాణ శాసనసభ ఈ నెల 14 తేదీ కీ వాయిదా!!
ADVERTISEMENT