| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య!

వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య!

డైలీ భారత్, వారణాసి: వారణాసి పుణ్యక్షేత్రంలో ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండబాబు (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్ 3న వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని వారణాసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్ ముథా జైన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Previous నేటి కేబినెట్ సమావేశానికి ట్రాన్స్ కో, జెన్ కో,సిఎండి,ని రప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Next కెసిఆర్ ఆరోగ్యం పై స్పందించిన నరేంద్ర మోడీ
ADVERTISEMENT