డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం కొలువుదీరిన కొద్ది గంటల వ్యవధిలోనే డా.బిఆర్.అంబేద్కర్ స చివాలయంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులు, పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రివర్గం మరో కీలకమైన అంశంగా వి ద్యుత్ రంగం పరిస్థి తులపైన హాట్‌హాట్‌గా చర్చలు జరిపారని తెలిసింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షత న గురువారం సచివాల యంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమా ర్క, మంత్రులు, సిఎస్ శాంతి కుమారి ఇతర శాఖల అధికారులు హాజ రైయ్యారు. ఆరు గ్యారెంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ముందుగా సిఎంగా సచివాలయంలో బాధ్యతలు రేవంత్‌రెడ్డి స్వీకరించారు.
సిఎంగా సచివాలయంలోకి అడుగుపెట్టిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. లోపల రేవంత్‌రెడ్డికి వేద పండితులు స్వాగతం పలికారు. తరువాత కేబినెట్ సమావేశం నిర్వహించి ఉచిత విద్యుత్, ఆరు గ్యారెంటీలపై మం త్రివర్గం చర్చించింది.
అనంతరం మీడియాతో మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈనెల 9న సోనియా గాంధీ జన్మ దినోత్సవం సందర్భంగా ముందుగా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచి పేదలకు వైద్య సేవలు అందిం చనున్నట్లు స్పష్టం చేశారు.
రాబోయే ఐదేళ్లలో ప్రజలు కోరుకునే మార్పు చూపిస్తామని, శుక్రవారం రెండు గ్యారెంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చించ నట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులుకు ఆదే శించినట్లు చెప్పారు.