| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

"ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో పవర్ లూం కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మనోవికాస సదస్సును నిర్వహించినారు.

ఈ సందర్భంగా పున్నం చందర్ మాట్లాడుతూ... కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని అన్నారు.

ప్రభుత్వం పవర్ లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాది కల్పించడం కోసం మహిళా శక్తి చీరల తయారీ కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తున్నదని తెలిపారు.

 వస్త్ర పరిశ్రమలోని ఆసాములు, యాజమానుల కోసం యార్న్ డిపోను ఏర్పాటు చేసి సబ్సిడీపై నూలు ను అందించి సహకారం అందిస్తున్నదని అన్నారు.

కార్మికులు మానసిక, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అనేక రకాల మానసిక రుగ్మతలకు తంభాకు, మద్యపాన సేవనం కారణమౌతుందని అన్నారు.

దురలవాట్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని కార్మికులకు సూచించినారు.

కార్మికుల మానసిక సమస్యల పరిష్కారం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. 

అవసరమైన కార్మికులు నేరుగా సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మరమగ్గాల పారిశ్రామికులు దుస ప్రసాద్, మైండ్ కేర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి లు పాల్గొన్నారు.

Previous జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ కలిసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బా నాయకులు
Next విద్యతోనే విచక్షణా జ్ఞానం : డిప్యూటీ కలెక్టర్ రాధా బాయ్
ADVERTISEMENT