డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ కలిసిన తుడుం దెబ్బ నాయకులు...పలు సమస్యలపై మెమరండం ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ఆదివాసి భూములు కనుమరుగైపోతున్నవనీ, కొంత మంది ఇతర కులస్తులు అధికారులతో కుమ్మక్కై దొంగ పాస్ బుక్కులు తయారుచేసి ఆదివాసీ భూములు లాక్కుంటున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో సర్వ హక్కులు ఆదివాసీలకె ఉండాలని,ఆదివాసి చట్టాలను ప్రతిష్ట చేయాలని,అన్యకాంతమైన ప్రభుత్వ భూములను వెలుకు తీసి,ఆ భూములను భూమి లేని నిరు పేదలకు పంచాలని,ప్రతి మండలానికి ఒక ఆదివాసి కమ్యూనిటీ హాల్ కేటాయించాలని,ఆదివాసి చట్టాలు.. హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు,
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబల్ల రవి, రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ అశ్వరావుపేట మండలం తుడుం దెబ్బ నాయకులు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.