| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెంచర్లో మొదలైన అక్రమ కట్టడాలు ?

వెంచర్లో మొదలైన అక్రమ కట్టడాలు ?

అనుమతులు లేని వెంచర్లు కొంటె తప్పవు తిప్పలు

రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు అనుమతులు మాత్రం నిల్

అనుమతులతో మాకేంటి అంటూ రెచ్చిపోతున్న రియల్ మాఫియా 

అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం

ఆకర్షణమీయమైన బ్రోచర్లు చూస్తే అంత శూన్యమే 

డైలీ భారత్, చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండ గ్రామపంచాయతీలో అక్రమ వెంచర్లు వేసి అమాయకుల జేబులు కాళీ చేస్తున్నారు. చుంచుపల్లి మండలంలో అనేక అక్రమ వెంచర్లు అక్రమ నిర్మాణాలు ఊపొందుకున్నాయి అనుమతులతో మాకేంటి మాకు నచ్చింది మేము చేసుకుంటాం అన్న రీతిలో చెలరేగిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఇంతతంగం జరుగుతున్న అధికారులకు తెలవకుండా ఉంటుందా అని సందేహం వెలవెత్తుతున్న ప్రజలు. వ్యవసాయ భూములలో ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా పంట పొలాలను చదివి చసి ప్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. చుంచుపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో గతంలో ఐటిఐ భవన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించి నా ప్రభుత్వ స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో కొనుగోలు చేసిన వారే అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరూ గమనిస్తూనే ఉన్నారు అయినాప్పటికీ గిరిజనులే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చుంచుపల్లి మండలంలో ఎక్కడ చూసినా భూతగాదాలతో నిత్యము పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూనే ఉంటారు దానికి కారణం ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. ఎవరికి నచ్చిన తీరుగా వాళ్ల ప్లాట్లుగా చేసి అమ్ముకుంటారు. తర్వాత కొన్నవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఈ మండలంలో జరుగుతున్నాయి.  అమాయక ప్రజలను మోసం చేస్తూ అనుమతులు లేని వెంచర్లు వేస్తున్న వ్యాపారస్తులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఫ్లాట్లు కొనడానికి ఎన్నో మాయమాటలు చెప్పి అమాయకులకు అమ్మిన తర్వాత కొన్నవారికి  పట్టపగలే చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు ఈ అక్రమ వెంచర్లను వేసే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Previous రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గెలుపొందిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థి
Next భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయండి : ఆడెపు రాజమౌళి పట్టణ కార్యదర్శి
ADVERTISEMENT