అభినందించిన ప్రిన్సిపల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి
డైలీ భారత్, చుంచుపల్లి:రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గెలుపొందిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి.చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామపంచాయతీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు 6వ తరగతి చదువుతున్న ఠాగూర్ మని చంద్ర ఈనెల 16 తేదీ ఉర్దూగర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఓపెన్ టైక్వాడూ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సబ్ జూనియర్స్ అండర్ 12 ఇయర్స్ కాటా ఈవెంట్ విభాగంలో స్వర్ణం పతాకం సాధించారు.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఠాగూర్ మని చంద్ర ని అభినందించారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో జాతీయస్థాయి పోటీల్లో మరెన్నో పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తపరిచారు.