డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట దమ్మపేటలో అక్రమంగా ఎస్సి కులదవీకరణ పత్రం పొందినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మార్వో గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి దళిత సంఘాల ఆధ్వర్యంలో మేమరండం ఇవ్వటం జరిగినది,వారు మాట్లాడుతూ దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామం నుండి 2015 సంవత్సరంలో పనిచేసినటువంటి ఎమ్మార్వో ఆఫీసు నుండి వీఆర్వో,ఆర్ ఐ, ఎమ్మార్వో లు కలిసి ఒక గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులు 1)పామర్తి సుభాష్ 2) పామర్తి రవీంద్ర పేరు కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు బీసీ గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులుగా ఉండి ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తులుగా ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగినది,ఈ మధ్యకాలంలో అదే నాగుపల్లి గ్రామంలో ఒక గొడవ జరగగా ఇరు వర్గాలు కేసులు పెట్టుకోగా పామర్తి సుభాష్ పామర్తి రవీంద్ర మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు డీఎస్పీ గారి సమక్షంలో ఎక్కించడం జరిగినది,ఈ విచారణ జరిపించే ముందు వీరిది ఎస్సీ కులమా...బీసీ కులమా అని ఎంక్వయిరీ చేపీయడం జరిగినది,పామర్తి సుభాష్,పామర్తి రవీంద్ర ది బీసీ గౌడ కులంగా నిర్ధారించటం జరిగినది,ఎవరైతే తప్పుడు దృవపత్రాలు పొందారో వారిపై చర్యలు తీసుకోవాలని...ఎస్సీ కులదీవికరణ పత్రం ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని తెలిపారు,ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ముత్యాలరావు, భూషణం,కొలికపోగు కాంతారావు, అశోక్,సూర్యం తదితరులు పాల్గొన్నారు.
News
అక్రమంగా ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందిన వారిపై చర్యలు తీసుకోవాలనీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎస్ఐ కి మెమరండం