| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో మరోసారి అమిత్ షా పర్యటన

తెలంగాణలో మరోసారి అమిత్ షా పర్యటన

హైదరాబాద్: మరోసారి తెలంగాణ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.. ఈమేరకు తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.ఈ పర్యటనలో అమిత్‌ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది...

Previous సోనియాతో షర్మిల భేటీ, పార్టీ విలీనం - ఏపీలో కీ రోల్, కడప బరిలో..
Next తెలంగాణ ఆర్టీసీ ఆల్ టైం రికార్డ్!
ADVERTISEMENT