నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి !
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాదులో MIM ప్రతి ఎన్నికల్లో గెలిచే 7 స్థానాల్లో నాంపల్లి కూడా ఒకటి అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఎంఐఎం పార్టీకి నాంపల్లి సీటు కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ విజయం సాధించి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు విశ్లేషించారు
ఫిరోజ్ ఖాన్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి నాంపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు
2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 35% ఓట్లను సాధించారు తర్వాత 2018కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ 35% ఓట్లను కాపాడుకొని ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు MIM పార్టీ అభ్యర్థి జాఫర్ హుస్సేన్ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచారు డిప్యూటీ మేయర్ గా కూడా పనిచేశారు ప్రస్తుతం MIMఅభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్నారు.
ఈ మధ్యకాలంలో ఫిరోజ్ ఖాన్ హిందువులు ముస్లిం తో ఒకేలా కలిసి ఉండటం గతంలో మూడు సార్లు ఓడిపోయిన మళ్ళీ ప్రయత్నించడం ప్రజలు సానుభూతితో పాటు కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉండటం నాంపల్లి ప్రజలు ఫిరోజ్ ఖాన్ నీ గెలిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు