| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పార్టీ జెండాలు పక్కన పెట్టండి గంప గుత్తగా కాంగ్రెస్ కి ఓటేయండి: రేవంత్ రెడ్డి

పార్టీ జెండాలు పక్కన పెట్టండి గంప గుత్తగా కాంగ్రెస్ కి ఓటేయండి: రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: పదేళ్ల కేసీఆర్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడిన అవస్థలు.. వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రజాక్షేత్రంలో వారిని కేసీఆర్ పురుగుల కంటే హీనంగా చూశారని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవాళ బహిరంగ లేఖ రాశారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసన్నారు.

వారిపై కేసులు పెట్టి వేధించి, పార్టీలు ఫిరాయింపజేసి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన పాలన చూశామన్నారు. వారికి నిర్ణయాధికారం లేక, నిధులు రాక ప్రజా ప్రతినిధులు పడిన బాధలు గుర్తున్నాయన్నారు.

ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు..

ఏ ప్రభుత్వ పాలన కైనా మీరే పునాదులు అని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారని వెల్లడించారు.

ఊరి కోసం అప్పుచేసి వడ్డీలు కట్టలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరికొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్ మెన్‌లుగా చేస్తున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరిగాయన్నారు

పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి

నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయని, ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటినాడు మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది.

ఇక బీఆర్ఎస్-కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుదాం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు మీ వంతు పాత్ర పోషించండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా.. వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు.. కార్పొరేటర్ నుంచి మేయర్ల వరకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. అని ఆవేదనతో బహిరంగ లేఖ రాస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Previous ఇన్ స్టా రీల్స్ చేస్తూ పరిచయాలు పెంచుకుంటోందని భార్యను హత్య చేసిన భర్త
Next హైదరాబాద్ లో MIM పార్టీకి ఒక సీటు తగ్గే అవకాశం ఉంది
ADVERTISEMENT