| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసి నష్టపోయిన ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ఆన్‌లైన్‌  ట్రేడింగ్‌ చేసి నష్టపోయిన ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

డైలీ భారత్, అమీన్‌పూర్‌:  ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసి నష్టపోయిన ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరం కత్తెర వీధికి చెందిన భానుచందర్‌(32) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు. గత మేలో ఓ బ్యాంకు ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ అమీన్‌పూర్‌ పీజేఆర్‌ కాలనీలో ఉంటున్నారు. షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే సంపాదన బాగుంటుందని ఏడు నెలలుగా ట్రేడింగ్‌ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొంతమొత్తంలో డబ్బులు వస్తున్నాయి. దీంతో ఆయన పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లాడు. చివరకు రూ.82 లక్షలు వరకు పెట్టిన డబ్బులు నష్టపోయారు. దీంతో మనస్తాపానికి గురైన అతను గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Previous నేటి నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
Next రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్..
ADVERTISEMENT