డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వారి నివాసంలో షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్,రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి బుదవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం... ప్రస్థానం ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని, మనసారా కోరుకుంటూ అందరికీ 2025 కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నేరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు.నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తల్లారి మల్లేష్, వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.