| Daily భారత్
Logo




డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : తమిళ్ నాడు బీజేపీ చీఫ్ అన్నామలై

News

Posted on 2024-12-27 18:24:02

Share: Share


డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : తమిళ్ నాడు బీజేపీ చీఫ్ అన్నామలై

డైలీ భారత్, తమిళనాడు డెస్క్: 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించిన అన్నామలై

అన్నా యూనివర్సిటీ కేసులో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని ఆగ్రహం

బాధితురాలి పేరు, ఫోన్ నెంబర్‌ను లీక్ చేశారన్న అన్నామలై

తమిళనాట డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు ధరించనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రతిజ్ఞ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశంపై రాజకీయ దుమారం రేగింది. ఈ అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం నాడు కోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, నిరసనలో భాగంగా శుక్రవారం నాడు తన నివాసం వద్ద ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానన్నారు. రేపటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనన్నారు.

అన్నా యూనివర్సిటీ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని మండిపడ్డారు. ఆమె పేరును, ఫోన్ నెంబర్‌ను ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని మండిపడ్డారు. తద్వారా పోలీసులు ఈ కేసులో సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >