డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నియోజక వర్గంలోనీ కొత్తూరు మండలం ఎస్బి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు లింగారం సురేష్ గౌడ్ రూ. 51 వేల విరాళం ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే శంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాల భవనం కోసం ఎంతోమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్నలిస్టులు అన్ని వర్గాలవారు తమకు తోచినంత సాయం చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కళాశాల ఒక్కరు కట్టే కన్నా అందరూ కలిసి ఒక్క రూపాయి అయినా ఇందులో విరాళం ఇస్తే అందరికీ బాధ్యత ఉంటుందని అన్నారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని మారుమూల ప్రాంతాల్లో విద్యా శక్తి ఉన్న నిరుపేదలకు మంచి విద్యను అందించేందుకే తన తాపత్రయం అని అన్నారు. సమాజంలో ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ సురేష్ గౌడ్ ను ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యేకు సురేష్ గౌడ్ పూల బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చెంది తిరుపతిరెడ్డి, అంబటి ప్రభాకర్, పాటిగడ్డ అఖిల్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..
News
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్