డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జిల్లేడు చౌదరిగూడ మండలం లాల్ పహాడ్ చౌరస్తాలో గారెల రాజు, అశోక్, ప్రవీణ్ స్నేహితుల కలిసి నూతనంగా ఏర్పాటు రుచి బావర్చి రెస్టారెంట్ ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు మిత్రులు కలిసి హోటల్ వ్యాపారంను ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. మానవుని ఆరోగ్యాన్ని పరిరక్షించే విధంగా వంటకాలను వడ్డించాలని, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, వినియోదారుల మెప్పును పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మండల అధ్యక్షులు హఫీజ్, పద్మా రెడ్డి, నాయకులు బంగారు రాములు, దేవేందర్ యాదవ్, సత్య ప్రమోద్ మాజీ సర్పంచులు అశోక్, బాబు రావు, జెట్ట కుమార్, బండి రాజు, చేగూర్ పీఎసీఎస్ చైర్మన్ అశోక్, నాయకులు జబ్బార్, జిల్లేడు వెంకటేష్, కొండి యాదయ్య, రామచంద్రయ్య, ధీమ గణేష్, నరేష్, సత్యం ముదిరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
News
రుచి బావర్చి రెస్టారెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్