డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం పరిగి రోడ్డు లో నూతనంగా ఏర్పాటుచేసిన డైమండ్ బావర్చి హోటల్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని హోటల్ యజమాని శివకు అభినందనలు తెలిపారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వడ్డించాలని, నాణ్యత, ప్రమాణాలతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తేనే హోటల్ రంగంలో రాణించగలుగుతామని అభిప్రాయపడ్డారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా నిత్యం పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం.ఎస్ నటరాజన్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
News
డైమండ్ బావర్చి హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్