డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :రెడ్డి యువజన సేవా సమితి 2025 క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుదవారం సంఘ సభ్యులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రావడం జరిగింది.ఎమ్మెల్సీ నవీన్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ మన సంఘం కోసం నా శాయా శక్తుల పని చేస్తానని సంఘం ముందుకు పోవడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన తెలపడం జరిగింది.మనం కలిసి కట్టుగా ఉంటెనే ముందుకు సాగుతాం గ్రామాల్లో కూడా సంఘాన్ని పరిచయం చేయాలన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని అన్నారు.రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదరికంలో ఉన్న రెడ్డి కుటుంబాలను ఆదుకునే విదంగా కృషి చేయాలని పెద్దలకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెడ్డి నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి ,గుండుబాయి శ్రీనివాస్ రెడ్డి , ఆండ్రా నరేష్ రెడ్డి చౌలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బసిరెడ్డి అజయ్ రెడ్డి , యాదిరెడ్డి, మహేందర్ రెడ్డి, విజయ రెడ్డి, పబ్బతి మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, యువజన సేవా సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.