| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో ప్రజల జీవితాలలో వెలుగులు పంచిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ లోని ఫాతిమాపూర్ చర్చిలో ఫాదర్ సైమాన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ప్రేమ, దయ,శాంతి,స్వేచ్ఛ మార్గాలను చూపుతూ తన బోధనల ద్వారా మానవాళికి తెలియజేసిన దేవుడు ఏసుక్రీస్తు అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జండగూడెం సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోంగల్ల హరినాథ్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ దయానంద్ గుప్తా,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కోశాధికారి చింత సాయి తేజశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రోళ్ల జగన్, గూడూరు సిద్దు గౌడ్,బాల్ శివ రెడ్డి,బాల్ రెడ్డి,విశాల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
Next ఒంటి కాలు పై నిలబడి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
ADVERTISEMENT