| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమగ్ర శిక్ష, URS, ఉద్యోగుల, ఉపాధ్యాయినిల సమ్మె కు TPTF మద్దతు

సమగ్ర శిక్ష, URS, ఉద్యోగుల, ఉపాధ్యాయినిల సమ్మె కు TPTF మద్దతు

వెట్టి చాకిరిని వ్యతిరేకిద్దాం..

సమగ్ర శిక్ష ఉద్యోగుల, ఉపాధ్యాయునిల  సమస్యలు పరిష్కరించాలి

TPTF కరపత్ర ఆవిష్కరణ లో TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 10 నుంచి చేస్తున్న సమ్మె కు మద్దతుగా TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 

SSA ఉద్యోగులకు  సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పు వర్తింపజేయడం లేదు అని తెలంగాణ ప్రభుత్వ మొదటి పిఆర్సీ కమిషన్ ఇచ్చిన సిఫారసు మేరకు కనీస వేతనం చెల్లించడం లేదనీ.. ఉద్యోగ భద్రత లేదు, వైద్య సదుపాయం లేదు. కనీసం ఉన్న సెలవులు వినియోగించుకోవాలన్నా ఎన్నో ఆంక్షలు. అన్నింటినీ తట్టుకొని పనిచేస్తున్నప్పటికీ ప్రోత్సాహం కరువైంది అని  పంజాబ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. ఆంద్రప్రదేశ్లో బేసిక్ పే చెల్లిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ గత పాలకులు పట్టించుకోలేదు.. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో TPTF జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు పర్వతి తిరుపతి, చకినాల రామచంద్రం,బండి ఉపేందర్, దూస సంతోష్, శ్రీరామోజు శ్రీనివాస్,సుల్తాన్ శ్రీనివాస్ లు SSA SO లు ఉద్యోగుల సంఘం నాయకులు దేవయ్య, వెంకటస్వామి, లు పాల్గొన్నారు..

Previous హాజిపల్లి రైతుల అంశాన్ని కలెక్టర్ కు వివరించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
Next జేఎన్టీయుహెచ్ జేఏసీ నూతన లోగో ఆవిష్కరణ
ADVERTISEMENT