| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గోవుల అక్రమ రవాణాని అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్-బజరంగ్దళ్ కార్యకర్తలు

గోవుల అక్రమ రవాణాని అడ్డుకున్న విశ్వహిందూ పరిషత్-బజరంగ్దళ్ కార్యకర్తలు

డైలీ భారత్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం MP బంజర సంత నుండి హైదరాబాదు కు చిన్న వ్యానులో అక్రమంగా తరలిస్తున్న 11 శాల్తీల గో సంతతితో ఉన్న వ్యాను పాల్వంచ మండలం బసవతారక కాలనీ వద్ద చక్రం విరిగిపోయి అదుపు తప్పి ప్రక్కన ఆపడం తో గ్రామస్తులు గమనించి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వడంతో  నిన్న(డిశంబరు 20) రాత్రి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు అక్రమంగా తరలిస్తున్న 11 గోవులను(6 ఎద్దులు, 4 ఆవులు, 1 ఆవు దూడ) పట్టుకుని పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది, వెంటనే స్పందించిన పోలీసు శాఖ వారు ఆవులను పాల్వంచ లోని అన్నపూర్ణ గోశాల కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది, ఈ విషయమై ఈ రోజు ఉదయం పాల్వంచ రూరల్ పోలీసు స్టేషను లో గోవుల అక్రమ రవాణా దారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు, బజరంగ్దళ్ జిల్లా సాప్తాహిక్ ప్రముఖ్ శ్రీరామోజు మధుసూదన చారీ, విశ్వహిందూ పరిషత్ పాల్వంచ ప్రఖండ కార్యదర్శి భూక్యా మోహన్, ప్రఖండ సహ కార్యదర్శి బి.రాము, ప్రఖండ బజరంగ్దళ్ గోరక్షా ప్రముఖ్ నూకల సతీష్ కుమార్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. 

Previous టీచర్లు లేరనే నిరసన వ్యక్తం చేసిన కస్తూరిబా గాంధీ విద్యార్థులు
Next అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
ADVERTISEMENT