| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్, హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా గొడవ చేయడానికి బిఆర్ఎస్ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంఎల్ఎ ఆది శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గానికి కోటి రూపాయలు బిఆర్ఎస్ పార్టీ కేటాయించినట్లు ఆరోపణలు చేశారు. తేలుకుంట్ల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కుట్ర చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఆది శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు.

కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందని

ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని, ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బు  పంపించారని, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా అప్రమత్తంగా ఉండాలని,  బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కన్నేసి ఉంచాలని  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు

ఈ కార్ ఫార్మూలా రేస్ వ్యవహారంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందన్న అభియోగం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై అవినీతి నిరోధకశాఖ గురువారం కేసు నమోదు చేసింది. నాలుగు సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసులో ఎ1గా కెటిఆర్, ఎ2గా అ ప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎ-3గా హెచ్‌ఎండిఎ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్న విషయం తెలిసిందే

Previous మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై,వాహన యజమానులపై కేసులు
Next ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్ లకు దరఖాస్తు చేసుకోవాలి
ADVERTISEMENT