| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్

ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్

-ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వండి 

-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 

డైలీ భారత్, వేములవాడ: ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.ప్రజల కష్టాలు తెలిసిన బిడ్డగా తనను ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజల త్యాగం వెలకట్టలేనిదన్నారు.ప్రజలు కోల్పోయిన భూమికి బిఅర్ఎస్ ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వకపోగా,వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ఆనాటి నుండి నేటి వరకు ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉండి అలుపెరగని పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.ఎన్నికల్లో పోటీ చేసే అవకాశవాదులు కేవలం అధికారం కోసమే ప్రజలకు వద్దకు వస్తారని,ప్రజల కష్టాలను పట్టించుకోరని తెలిపారు.గతంలో ముంపు గ్రామాల ప్రజలు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు ఎవ్వరూ మర్చిపోవద్దన్నారు.మంచి నాయకుడిని ఎన్నుకున్నపుడే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.ప్రజల బాధలు దగ్గర చూసిన వ్యక్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని,నాలుగు సార్లు ఓడి పోయిన ప్రజల మధ్యనే ఉన్నానే కానీ,పరాయి దేశం పోలేదన్నారు.బిఅర్ఎస్,బిజేపి నాయకులు కేవలం అధికారం, పదవుల కోసం మాత్రమే మాయ మాటలు చెపుతున్నారని,వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి మరోసారి మోస పోవద్దన్నారు.ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి చేతి గుర్తుపై ఓటు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండే పాలన కొనసాగిస్తామన్నారు.నియోజకవర్గంలో ఎక్కడికి పోయిన ప్రజలు చూపించే ప్రేమాభిమానాలే తనను కొండంత దైర్యమని,తమ బిడ్డగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముంపు గ్రామాల ప్రజలు,మహిళలు,యువకులు పాల్గొన్నారు.

Previous తెలంగాణలో మొదలైన పోలింగ్
Next బిఆర్ఎస్ భారీ షాక్..బిఆర్ఎస్ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక
ADVERTISEMENT