డైలీ భారత్,నూజివీడు: నూజివీడు నుంచి హైదరాబాద్ BHEL కి వెళుతున్న ఇంద్ర బస్సు నార్కెట్ పల్లి వద్ద ప్రమాదానికి గురైంది.. తెల్లవారుజామున 3.35 కు నూజివీడు ఇంద్ర బస్సు ఎదురుగా వెళుతున్న మరో RTC బస్సు ను వెనుక నుంచి డీ కొట్టింది.. ఎదురు బస్ సడన్ బ్రేక్ వేయటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇంద్ర బస్ ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రయాణికులందరూ సురక్షితం.. ఎవరికీ ఎటువంటి గాయాలు అవలేదు. అయితే తెల్లవారుజామున కావటంతో ప్రయాణికులందరు గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అందరూ ఉలిక్కి పడి లేవటం అహకారాలు పెట్టడం జరిగింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్టభించిపోయింది.. సమాచారం అందుకున్న RTC అధికారులు ప్రయాణికులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
News