| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు

బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు

డైలీ భారత్ ,తెలంగాణ: తెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ..

బీజేపీ కీలక హామీలు ఇలా ఉన్నాయి : 

* కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న ఎరువుల సబ్సిడీ ఎకరానికి రూ.18 వేలతోపాటు చిన్న, సన్నకారు రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు 2 వేల 500 రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

* ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు చేయటం

* వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర

* పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు

* ఆసక్తి ఉన్న రైతులకు దేవీ ఆవులను ఉచితంగా అందించడం

* జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేయటం

* ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను పున:పరిశీలించి, గిరిజన వర్గాల రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచేలా హామీ

* ఎస్సీల్లో వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం

* ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేస్ట్ మేనేజ్ మెంట్ లో సహ యజమానులుగా గుర్తించడం

* ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయటం

* అయోధ్య, కాశీలకు వయోవృద్ధులకు ఉచిత యాత్రలు నిర్వహించటం

* దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 25 లక్షల రూపాయల వరకు తాకట్టు లేని.. తక్కువ వడ్డీకే రుణాలు

Previous ముంపుగ్రామాలపై బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్
Next 15L విలువైన గంజాయి స్వాధీనం
ADVERTISEMENT