-వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్..
-వేములవాడ మండల పరిధిలో కాంగ్రెస్ రోడ్ షో
డైలీ భారత్, వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అది శ్రీనివాస్ అన్నారు..శుక్రవారం రోజున వేములవాడ మండలంలోని బొల్లారం,లింగంపల్లి,మల్లారం,మర్రిపెళ్లి గ్రామాల్లో లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మీ మధ్య ఉన్న మీ ఇంటి బిడ్డాగ వస్తున్నాని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు..నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సరైన ఇంజనీరింగ్ ప్రణాళిక లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టు అన్నారం ప్రాజెక్టులను, నాణ్యత లేకుండా నిర్మాణం చేసి ప్రాజెక్టుల పేరుతో ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చరాని తెచ్చిన అప్పుతో కేసీఆర్ బాగుపడ్డాడు, కానీ అనాతి కాలంలోనే ప్రాజెక్టులు కింగిపోయినాయని ఎద్దేవా చేశారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు..
దయచేసి నియోజకవర్గ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు...