| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు

హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు

డైలీ భారత్, జగిత్యాల : ఆంజనేయస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ లో చోటు చేసుకుంది. ప్రముఖ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ కామన్ వద్ద గల హనుమంతుని విగ్రహాన్ని ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు ఈ దాడికి పాల్పడిన వారిని వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు

Previous సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో కీలక మార్పులు
Next రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి
ADVERTISEMENT