డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు లో అనేక రకాలైన లోపాలు ఉన్నాయనీ, నిబంధనలకు విరుద్ధంగా ఒక మండలంలో ఉన్న ఉపాధ్యాయులను వేరే మండలంలోకి ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని అన్నారు.. G.O.25 ప్రకారం కాంప్లెక్స్ పరిధిలో తర్వాత మండల పరిధిలో ఆ తరువాత పక్క మండలాలలో సర్దుబాటు చేయాలని ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ అలాంటివి ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా సర్దుబాటు చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు... విద్యాశాఖ అధికారులు కొన్ని పాఠశాలలో సింగిల్ టీచర్ పాఠశాలల్లో సంఖ్య ఉన్నప్పటికీ అందులో పోస్టును సర్దుబాటు చేయలేదు. మరియు సంఖ్య ఉన్నా కూడా కొన్ని పాఠశాలల నుండి సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులని వేరే పాఠశాలలకు పంపించారు.. కాబట్టి ఇట్టి అసంబద్ధమైనటువంటి సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలి
News