| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం.. 70 దేశాల భామలను వెనక్కి నెట్టి క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా

దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం.. 70 దేశాల భామలను వెనక్కి నెట్టి క్రౌన్ అందుకున్న రేచల్‌ గుప్తా

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బ్యాంకాక్‌లో జరిగిన ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ పోటీలు.ఈ విజయంతో ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డు కూడా రేచల్ సొంతం.ఈ అవార్డుతో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా సరసన రేచల్గ గతంలోనూ పలు అందాల పోటీల్లో అవార్డులు గెల్చుకున్న పంజాబ్ భామ

గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.


ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. 

Previous అసంబద్ధమైన జిల్లా ఉపాధ్యాయ సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే సవరించాలి : DTF రాజన్న సిరిసిల్ల జిల్లా
Next సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి TSUTF జిల్లా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు
ADVERTISEMENT