ఆర్ఎంపీ డాక్టర్లు ఆత్మీయ సమావేశంలో ఆది
డైలీ భారత్, వేములవాడ: నియోజకవర్గమే ఇల్లుగా..ప్రజలే కుటుంబసభ్యులుగా బతుకుతున్న తనకు ఒకసారి ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో ఆర్ఎంపీ డాక్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.
అన్ని వర్గాలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ..ఇంటి మనిషి లెక్క సేవ చేస్తానని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గడప తొక్కే మీరూ ..నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సహకరించి.. గెలిపించాలని ఆర్ఎంపీ డాక్టర్లను ఆది కోరారు.