ఆది శ్రీనివాస్ ప్రజల మనిషి
ఆపద వస్తే అండగా ఉంటాడు
డైలీ భారత్, వేములవాడ: కరోనా వచ్చినా.. ఇంకేదైనా ఆపద వచ్చినా మన మధ్యలో ఉంటూ మనకు అండగా ఉంటూ మన యోగక్షేమాలు పట్టించుకునే కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు ఒకసారి ఓటేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు చిలుక రమేష్, పులి రాంబాబు, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, మూల కిషోర్, లింగంపల్లి కిరణ్, గుర్రం తిరుపతి, ఆగయ్య, విద్యాసాగర్, తదితరులు వాకర్ అసోసియేషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వేములవాడ పట్టణంలో వాకర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులందరికీ ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు.
చుట్టపు సూపుగా వచ్చినొడు.. నాలుగు రోజులు మురిపించేటోడు మనకు కిరీటం పెడతాడా..? మన నెత్తిమీద టోపీ పెట్టి తన దారిలో తాను పోతాడని... ఓటర్లకు వివరిస్తూ .. చైతన్యపరస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్తం గుర్తుకు ఓటేసి శీనన్న గెలిపించాలని కోరుతున్నారు.