| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమస్యలు ఉత్పన్నం కాకుండా నీరు అందించాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సమస్యలు ఉత్పన్నం కాకుండా నీరు అందించాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ డివిజన్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మిషన్ భగీరథ మంచినీటి సరఫరా జరగాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మిషన్ భగీరథ అధికారులు సిబ్బందికి సూచించారు.

మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ శిబిరం షాద్ నగర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ నిర్వహణ వ్యవహారాలపై ఆయన అధికారులను సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఇంటర్ ఎస్.సి ఆంజనేయులు, ఈఈ రాజేశ్వర్, డిఈ అబ్దుల్ బారి, గ్రిడ్ డి ఈ సందీప్, వివిద మండలాల ఏఈలు, వాటర్ మేన్ లు పాల్గొన్నారు..

Previous ఏసీబీకి చిక్కిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
Next శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి వెండి మకర తోరణాలు బహూకరణ
ADVERTISEMENT