| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి వెండి మకర తోరణాలు బహూకరణ

శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి వెండి మకర తోరణాలు బహూకరణ

శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం దేవాలయానికి భారి విరాళం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారి ఆకుల వెంకటేశం ధర్మపత్ని ఆకుల అరుణ ఇచ్చారు. ఆకుల అరుణ వెంకటేశం కుమారుడు  కీర్తిశేషులు ఆకుల రాఘవేంద్ర జ్ఞాపకార్థం దేవాలయంలోని  శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ వినాయక స్వామి వార్లకు 9 లక్షల రూపాయలతో వెండి మకర తోరణాలు చేయించడం జరిగింది. ప్రభలను (మకర తోరణాలను) సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కల్వ యాద గిరీష్ కు అప్పగించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆకుల వెంకటేశం , వారి ధర్మపత్ని అరుణ గార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కల్వ మురళి, కోశాధికారులు నర్సిని వెంకటేష్,  బండారి వజ్ర లింగం, కోవూరు గోపాలకృష్ణ , దాసరి చంద్ర శేఖర్, సలహా సంఘం సభ్యులు పెద్ది రామ్మోహన్ , గజ్జల వినోద్, మెడికల్ రిప్రజెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..

Previous సమస్యలు ఉత్పన్నం కాకుండా నీరు అందించాలి : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next యువతీ యువకులు రక్తదానం చేయాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT