| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి!

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి!

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లో ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రప తి ద్రౌపది ముర్ము, ఈరోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చారు.   

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు. 

తర్వాత మేడ్చల్‌ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. 

అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుని.. భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు.

Previous భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
Next జిహెచ్ఎంసి పరిధిలో ఎలాంటి బ్యానర్లు పోస్టర్లు అంటించరాదు: మున్సిపల్ కమిషనర్ అమ్రపాలి
ADVERTISEMENT