| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెల్లవారుజామునుంచే హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

తెల్లవారుజామునుంచే హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా తెల్లవారుజామునుంచే ప్రారంభించింది. కూకట్ పల్లి నల్లచెరువులో, అమీన్ పూర్, మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉంది. ఇందులో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది.

Previous మరోసారి తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్న భాండాగారం
Next సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి
ADVERTISEMENT