| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మూసీని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

మూసీని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మూసీని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం భవాని నగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం పరిశీలించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,రోడ్డు డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి.హైదరాబాద్ నగరాన్ని కొత్త ఇన్నోవేటేడ్ కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్తుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మూసి ప్రక్షాళన మూసి పునః నిర్మాణం భవిష్యత్ ప్రణాళికలతో పోతున్నామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింహ యాదవ్, శ్రీపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణు యాదవ్, ఆనంద్ గౌడ్, ప్రేమ్, యువజన కాంగ్రెస్ నాయకులు పన్యాల జైపాల్ రెడ్డి, శ్యామ్ చరణ్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, వెంకట్ రాంరెడ్డి, గణేష్ రెడ్డి, జెబి గౌడ్, బద్రి, గణేష్ నాయక్, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.

Previous విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ సిగ్నల్స్,ట్రాఫిక్ నియమాలు పై అవగాహన ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
Next జహంగీర్ పీర్ దర్గాలో మిలాద్ ఉన్ నబి వేడుకలు
ADVERTISEMENT