| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!

డైలీ భారత్,దుబ్బాక:అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల్లో సోమవారం బాల రాముడు మెరిసిపోయారు.

చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు. అయోధ్య బాలరాముడి విగ్రహానికి దుబ్బాక చేనేత వస్ర్తాలు మరోసారి అలంకరించడంపై స్థానిక నేతన్నలు సంతోషం వ్యక్తంచేశారు.

Previous న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడి ఎస్సై ఆత్మహత్యాయత్నం
Next ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ADVERTISEMENT