| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వినాయకుని లడ్డూను దక్కించుకున్న గానీ పికెపి సిండికేట్ సభ్యులు

వినాయకుని లడ్డూను దక్కించుకున్న గానీ పికెపి సిండికేట్ సభ్యులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో విద్యార్దుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డూ ల ప్రసాదం వేలం పాట పోటాపోటీగా సాగింది మొదటి లడ్డూను షాబాద్ మండల కేంద్రానికి చెందిన గానీ పికెపి సిండికేట్ సభ్యులు శ్రీధర్, సత్యనారాయణ,చిన్నయ్య ,కార్తీక్ ,శ్రీకాంత్ ,సాయిచంద్ ,శివ రూ. 12వేల ఒక వందకు దక్కించుకున్నారు. రెండో లడ్డును మంగలి రవికుమార్ 

3,100 వేలం పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Previous బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడి లడ్డూ ఎన్ని లక్షలో తెలుసా..?
Next కొండెక్కిన కూరగాయల ధరలు..!!
ADVERTISEMENT