Posted on 2024-07-23 08:52:30
అభం శుభం తెలియని పసిప్రాణాలపై అఘాయిత్యాలు ఆగేదెన్నడు?
కామాంధుల కాటుకు బలైతున్న చిన్నారులు
వికృత క్రీడలకు ముగింపు లేదా--కామాంధులపై చర్యలు ఏవి
కఠిన చట్టాలు కూడా దుర్మార్గుల ఆట కట్టించలేకపోతున్నాయా
ఏం చేస్తే పసిబిడ్డలు-ఆడబిడ్డలకు రక్షణ??
దిశ ఘటన జరిగిన చోటే మరో ఘటన..
డైలీ భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో దారుణం చోటుచేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని నాలుగు సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు ఒడి కట్టాడు...
ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మహబూబ్నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు దరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు నిందితుడు ఆంజనేయులుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ ఘటన పునారావృత్తం కాకుండా నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకుంటున్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >