Posted on 2024-07-22 12:02:09
శాంతిపై కొత్తగా తొమ్మిది అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్పెన్షన్‌లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. ‘‘దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె. మదన్‌మోహన్ అని సర్వీస్ రిజిస్టర్‌లో ఆమె నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.
రికార్డుల్లో భర్త పేరు మదన్‌మెహన్‌గా పేర్కొన్నారంటూ శాంతికి నోటీసులు,
ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >