| Daily భారత్
Logo




భూకబ్జా గ్యాంగ్ అరెస్ట్.... మారణాయుధాలు స్వాధీనం...

News

Posted on 2024-07-22 08:38:42

Share: Share


భూకబ్జా గ్యాంగ్ అరెస్ట్.... మారణాయుధాలు స్వాధీనం...

డైలీ భారత్, అత్తాపూర్: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది కబ్జారాయళ్ల వశమైనట్టే. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాంగ్‌లు తిరుగుతున్నాయి. తాజాగా అత్తాపూర్‌లో ల్యాండ్ కబ్జా‌కి వచ్చిన 9మంది సభ్యుల గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

జంట నగరాల్లో ఖాళీ స్థలాలు కనిపిస్తేచాలు కబ్జా అయిపోయినట్టే. ఖాళీ స్థలాలను సొంతం చేసుకునేందు కు రౌడీ‌షీటర్లు భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఆ తరహా వ్యవహారం ఒకటి అత్తాపూర్‌లో బయటపడింది. ఉప్పర్‌పల్లి అక్బర్ హిల్స్ ప్రాంతంలో ఐదు వందల గజాల భూమిలో కొందరు రాత్రివేళ నిర్మాణాలు చేపట్టారు. ఫక్రుద్దీన్ గ్యాంగ్ దీన్ని కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ ఈ గ్యాంగ్ మూమెంట్స్ అధికంగా ఉంది.

వాళ్లను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి రైడ్స్ చేశారు. దాదాపు 9మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పదునైన కత్తులు, గన్స్, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ప్రాంతంలో ఆ గ్యాంగ్ డాగ్స్‌ను తీసుకురావడం, మరణాయుధాలు ఉంచడం, ఆ స్థలం చుట్టూ సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం స్పష్టంగా కనిపించింది.

బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తోంది ఫక్రుద్దీన్ గ్యాంగ్. గతంలో ఈ గ్యాంగ్ నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కొద్దిరోజుల కిందట శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగే ఇక్కడ కూడా కార్యకలాపాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు రియల్టర్లు ఉన్నారు.

ఫక్రుద్దీన్ గ్యాంగ్‌కు సంబంధించి ఇది మూడో వ్యవహారం. వీరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి విచారణ‌లో ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.


Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >