ప్రమాదవశాత్తు రోడ్ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తమ వాహనంలో ఆసుపత్రికి తరలించిన ఆర్.ఐ మాధుకర్,యాదగిరి.
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :తంగాలపల్లి మండలం ఓగులపురం గ్రామానికి చెందిన వ్యక్తి సిరిసిల్ల నుండి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో జెడ్పీ కార్యాలయం ముందు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం స్కిడ్ అయి డివైడర్ కు గుద్దుకొని కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి లు తన సిబ్బంది సహాయంతో తమ వాహనంలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.