డైలీ భారత్, తిరుపతి: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈరోజు ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై శ్రీవారిని ఊరేగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై శ్రీవారిని ఊరేగించనున్నారు.
నేడు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
మంగళవారం శ్రీవారిని 72,123 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా టిటిడి అధికారులు తెలిపారు