| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం : సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ

అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం : సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ

అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే విధానాలను మానుకోవాలి

సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : అంగన్వాడి ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం 2024 ఏప్రిల్ 3 న తీసుకువచ్చిన మెమో నెం - 1334 / ఐ.సి.డి.ఎస్ - 1 / 2024 ను తక్షణమే ఉపసంహరించుకొని సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు , హెల్పర్లకు 1 లక్ష రూపాయలు పెంచి 60 సంవత్సరాల తర్వాత అంగన్వాడి ఉద్యోగులకు వీఆర్ఎస్ తీసుకునే సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే కొత్త జీవో ఉత్తర్వులు జారీ చేయాలని  ఈరోజు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , అన్నల్దాస్ గణేష్ గార్లు  DWO జిల్లా సంక్షేమ అధికారి గారిని కలిసి వినతి పత్రం అందించి జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలపై వారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పౌరులను తీర్చిదిద్దడంలో భాగంగా బాలింతలు , గర్భిణీలు , చిన్నపిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యను అందిస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారదులుగా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో భాగంగా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలందిస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా అంగన్వాడి ఉద్యోగులను మోసం చేస్తూ నష్టం చేసే విధంగా పాత జీవోలనే అమలు చేస్తూ అంగన్వాడి ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి నెలకొన్నదని గత సంవత్సరం అంగన్వాడి ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులపాటు సమ్మె కాలం జీతాలను కూడా ఇప్పటివరకు చెల్లించలేదని మండిపడ్డారు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఉద్యోగులు 44 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తూ 4  కొత్త జీఓలను జారీ చేసి సమ్మె కాలం వేతనాలను కూడా చెల్లించడం జరిగిందని ఎన్నికల అనంతరం జూలై లో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని రాతపూర్వకంగా మినిట్స్ అంగన్వాడి నాయకత్వానికి అందించడం జరిగిందన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడి టీచర్లకు రిటర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు , హెల్పర్లకు 1 లక్ష రూపాయలు పెంచి 60 సంవత్సరాల తర్వాత  విఆర్ఎస్ సౌకర్యం కల్పించే విధంగా జీవో జారీ చేయాలని సమ్మె కాలం వేతనాలను అందించాలని మిగిలిన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు రావాలని లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతామని అన్నారు

Previous పిఠాపురంఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
Next మళ్లీ తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత
ADVERTISEMENT