| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం : ప్రొఫెసర్ కోదండరాం

పేదింటి బిడ్డ నీలం మధును గెలిపించుకుంటాం : ప్రొఫెసర్ కోదండరాం

డైలీ భారత్, చేగుంట, మెదక్: తెలంగాణ జన సమితి

 పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ప్రొఫెసర్ కోదండరాంని మర్యాదపూర్వంగా కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు

మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను గెలిపించుకుంటామని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. . ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మెదక్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలలో బీసీలు గెలిచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. తమ శక్తి మొత్తాన్ని ఉపయోగించి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లాలోని  ప్రజా సంఘాలన్నిటిని ఏకం చేస్తామన్నారు. బీఆర్ఎస్, బిజెపిలు ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని, ఈ ఎన్నికలలో ఆయా పార్టీలను ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. మెతుకు సీమ నుంచి బరిలో నిలిచిన బీసీ బిడ్డ నీలం మధును గెలిపించుకుందామ్

Previous దూరదర్శన్ లోగో మార్పు బాధ కలిగిస్తుంది: మాజీ సీఈవో
Next అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల రిమాండ్
ADVERTISEMENT