| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోపా ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ మరియు హెల్త్ క్యాంప్

పోపా ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ మరియు హెల్త్ క్యాంప్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ రోజు పద్మశాలి విద్యార్థుల కోసం 45 రోజుల పాలిటెక్నిక్ శిక్షణను మరియు హోమియోపతి హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి పోపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నo చందర్ మాట్లడినారు.


ఈ సందర్భంగా పున్నo చందర్ మాట్లడుతూ పాలిటెక్నిక్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం మండల అభివృద్ధి అధికారి దూస రఘుపతి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిపుణులైన 25 మంది పద్మశాలి టీచర్స్ తో ఈ కార్యక్రమం నిర్వహించడం మన పద్మశాలి సమాజానికి గర్వకారణం అన్నారు.

శిక్షణను కొనసాగించేందుకు తగిన సలహాలు,సూచనలు చేసినారు.

అనంతరం హంస హోమియోపతి కాలేజ్ సహకారంతో పోపా మరియు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో హెల్త్ క్యాంపును నిర్వహించినారు.

ఈ హెల్త్ క్యాంపులో 245 మందికి 14 మంది డాక్టర్స్ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.


ఈ కార్యక్రమాలను ఉద్దేశించి పోపా సీనియర్ సభ్యులు గాజుల ప్రతాప్ మాట్లాడుతూ  

పాలి సెట్ శిక్షణ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని అన్నారు.

పోపా డాక్టర్స్ డాక్టర్ పత్తిపాక రఘు, డాక్టర్ అరుణ, డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ రవళి డాక్టర్ సతీష్, డాక్టర్ శివరామకృష్ణ లు పాల్గొన్నారు.

హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, డాక్టర్ సుమంత్, హంస మెడికల్ కాలేజ్ డైరెక్టర్ ఎ. ఉమేష్ లు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో పోపా సభ్యులు వాసాల హరి ప్రసాద్, మామిడల భూపతి, జి .భూమేశ్, సామల తిరుపతి, మచ్చ ఆనందం, భైరి రవీందర్, డి. పరమేశ్వర్, శ్రీపతి భూమెష్, కొడం రాం ప్రసాద్, కారంపూడి రాజేశం, ఆడేపూ వేణు, కొక్కులా శ్రీను, నాగుల శ్రీను, జక్కని శ్రీను, భైరీ రమాదేవి, తారిపాముల భాస్కర్, కనుకుంట్లా మధు, బాలే లక్ష్మీనారాయణ, బండారి శ్రీను, గడీల రమేష్, క్యదరి రాజేందర్, గుండేళ్లి రవీందర్, చౌకీ చంద్రశకర్, అంకారపు గ్యనోభ, దేవత ప్రభాకర్, జకని నవీన్, అదేపూ గణేష్, రాఘవేందర్, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, బూర సత్యనారాయణ,  విద్యార్థులు పాల్గొన్నారు.

Previous అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి: కలెక్టర్ అనురాగ్ జయంతి
Next బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా: బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి - తీగల శేఖర్ గౌడ్
ADVERTISEMENT