| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్

డైలీ భారత్, వరంగల్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  ప్రకటించారు.

హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.

2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్  సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.

Previous ఆన్లైన్ గేమ్స్‎తో యువతి అప్పులపాలై....డబ్బుకోసం సొంత ఇంటికే కన్నం
Next భర్తను చంపేందుకు.. కి’లేడి’ పక్కా ప్లాన్
ADVERTISEMENT